ఈ యేడు.. మంటో. మంటస్య. మంటోభ్యహ

updated: February 27, 2018 13:25 IST
ఈ యేడు.. మంటో. మంటస్య. మంటోభ్యహ

ఎన్నడూ లేనంతగా ఈ సంవత్సరం .. చండ్ర భానుడు నిప్పులు చెరుగే పోగ్రాం పెట్టుకోబోతున్నాడు. విపరీతమైన ఎండలతో దేశ ప్రజ అల్లాల్లాడనుంది. నీటి కటకటలు మొదలు కానున్నాయి. దాంతో పాటే విద్యుత్‌ కోతలు పెరుగబోతున్నాయి. పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాసాలు ఉన్నాయి. ఇవన్నీ మేం చెప్తున్నవి కాదు..రాష్ట్ర వాతావరణ శాఖ చెప్తున్న వివరాలు. 

చాలా కాలం తర్వాత ఈ ఏడాది శీతాకాలం సుదీర్గంగా కొనసాగింది. ఇంకా అక్కడక్కడా కొన్ని  ప్రాంతాల్లో చలి ప్రభావం కనపడుతోంది. అందువల్ల రాబోయే వేసవి కాలం ఎక్కువ రోజులు ఉండనుందనేది ఓ అంచనా. మార్చి నుంచి మే నెల వరకూ గల వేసవిలో ఉత్తర, వాయువ్య భారతాల్లో రికార్డ్ ఉష్ట్రోగ్రతలు నమోదు కానున్నాయని వాతావరణ సంస్దలు హెచ్చరిస్తున్నాయి. దానికి తోడు ఈ సంవత్సరం ఉత్తరాదిలో మంచు తక్కువగా ఉంది. మంచు తక్కువగా కురిస్తే ఉత్తరాదిలో వేసవి తీవ్రంగా ఉంటుందని అనేక అధ్యయనాలు చెప్తున్నాయి.

 

ముఖ్యంగా, దక్షిణాదిలో ఏకంగా 43 నుంచి 45 డిగ్రీల మేరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్, విశాఖపట్టణం వాతావరణ కేంద్రాలు వెల్లడిస్తున్నాయి.   అసాధారణ ఉష్ణోగ్రతలకు తోడు అదేసమయంలో వచ్చే నైరుతి రుతుపవనాలు చురుగ్గా వుంటాయని చెబుతున్నారు. 

అయితే ఉత్తరాది కంటే వాయువ్య భారతం ప్రధానంగా రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లలో వేసవి ప్రభావం ఎక్కువగా ఉంటుందంటున్నారు. ఎడారి మీదుగా వీచే గాలులతో వాయువ్య భారతం దానికి ఆనుకుని మధ్యభారతం వేడెక్కే అవకాశాలు ఉన్నాయి. ఉత్తర, వాయువ్య భారతాలతో పోల్చితే దక్షిణాదిలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదుకావచ్చు

Shashank Sahay

comments