'మండే' సూర్యుడు లెక్కలు ఇవే

updated: March 6, 2018 13:54 IST

హైదరాబాద్ లో గత నాలుగు రోజుల్లో ఉష్ట్రోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీలు పెరిగాయి. మరో వారం రోజుల్లో ఉష్ట్రోగ్రతలు 37 నుంచి 38 వరకూ పెరిగే అవకాసం ఉందని బేగంపేట వాతావరణ శాఖ అథికారి నాగారత్నం తెలిపారు.  మరో ప్రక్క పెరుగతున్న ఎండల కారణంగా బాక్ట్రీరియాలు, వైరస్ లు విజృంభించే అవకాసం ఉందని, జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అని వైద్యులు హెచ్చరిస్తున్ారు.  ఇప్పటికే నగరంలో చికెన్ ఫాక్స్  తీవ్రంగా కలవరపెడుతోంది. వయస్సుతో సంభందం లేకుండా ఈ వ్యాది ఇప్పుడు నగరంలో కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో భారత వాతావరణ శాఖ ఏమంటోందో చూద్దాం.

 

ఈ ఏడాది ఎండలు మండిపోనున్నాయని బారత వాతావరణ శాక (ఐఎండీ) ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఉత్తరభారతదేశంతో పోలిస్తే దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లో ఎండలు కాస్తంత తక్కువగానే ఉండనున్నాయని తెలిపింది. పలు ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం ఎండలు మండిపోనున్నాయని స్పష్టం చేసింది.  హైదరాబాద్, బెంగుళూరు నగరాల్లోనూ ఎండలు ఎక్కువగానే ఉండనున్నాయని వెల్లడించింది. ఈ వేసవిని ఎదుర్కొనేందుకు ప్రజలు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని వాతావరణ శాఖ డైరక్టర్ వైకే రెడ్డి తెలిపారు. 45 డిగ్రీల వరకూ ఎండలు నమోదు కానున్నాయని ఆయన తెలిపారు.  దేశంలోని 17 రాష్ట్రాల్లో సాధారణం కన్నా ఒక డిగ్రీ ఎక్కువ ఉష్ట్రోగ్రతలు నమోదయ్యే అవకాసం ఉన్నట్లు చెప్పారు. 

 

ఇక కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లలో కొన్ని ప్రాంతాల్లో సాధారణం కన్నా 0.5 డిగ్రీల ఎక్కువ ఉష్ట్రోగ్రత నమోదు అయ్యో అవకాసం ఉంది. కాగా ఎల్నినో కారణంగా గతేడాది సరైన వర్షాలు పడలేదు. కానీ ఈ సారి లాలినా వల్ల కొంత వరకూ ఉపశమనం లభిస్తుందని  ఐఎండీ స్పష్టం చేసింది.  పసిఫిక్ మహాసముద్ర తూర్పు భూమధ్య రేఖ ప్రాంతంలో ఏర్పడే లానినా పరిస్దితుల వల్ల మన దేశంలో వర్షాలు మెండుగా కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. లానినా పరిస్దితులంటే తూర్పు భూమధ్యరేఖ ప్రాంత పసిఫిక్ మహాసముద్ర జలాల ఉష్ణ్రోగ్రతలు తగ్గుతాయి. కచ్చితంగా వర్షాకాలం ఎలా ఉంటుందన్నది ఐఎండీ చెప్పకపోయినా ఈ పరిస్దితులు మాత్రం మంచి పరిణామమే స్పష్టం చేసింది.  

comments